Friday, May 3, 2024

పరిశుభ్రతకు మారు పేరు తెలంగాణ పల్లెలు.. బోయిన‌ప‌ల్లి వినోద్‌ కుమార్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పరిశుభ్రతకు మారుపేరు తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలని, పచ్చదనం పరిశుభ్రతతో తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు విరాజిల్లుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. #హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌ పూర్‌ గ్రామంలో బుధవారం జరిగిన ఐదవ విడత పల్లె ప్రగతి ఈ కార్యక్రమంలో వినోద్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామం అంతా కలియ తిరిగారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను చూసి వినోద్‌ కుమార్‌ ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ మురికి కాలువలు, రోడ్లను, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ రాష్ట్రంలోని పల్లె ప్రాంతాలు యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. అందుకు నిదర్శనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అవార్డులే సాక్ష్యమని వినోద్‌ కుమార్‌ అన్నారు.

సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజన కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా, అందులో 19 గ్రామాలు ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే ఎంపిక కావడం విశేషమని వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. స్వచ్ఛభారత్‌ విభాగంలో దేశవ్యాప్తంగా పది ఉత్తమ గ్రామాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా, అందులో తొమ్మిది గ్రామాలు తెలంగాణ రాష్ట్రం నుంచే ఎంపికయ్యాయని వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఈ వాస్తవాలను ఎవరు కూడా దాచలేరని ఆయన అన్నారు. పచ్చదనం, పరిశుభ్రత కోసం సీఎం కేసీఆర్‌ ప్రతియేటా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వ#హస్తున్నారని వినోద్‌ కుమార్‌ తెలిపారు. గోపాల్‌పూర్‌ గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ సుధీర్‌బాబు, ఎంపీపీ స్వప్న, సర్పంచ్‌ భాస్కర్‌రావు, ఎంపీటీసీ యశోద, వైస్‌ ఎంపీపీ నగేష్‌, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement