Saturday, May 4, 2024

భారమైన సిటీ బస్సు ప్రయాణం..

ప్రభన్యూస్‌, హైదరాబాద్ : నెలరోజుల వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మూడు సార్లు బస్సు చార్జీలను పెంచింది. టీఎస్‌ఆర్టీసీ ఇబ్బడిముబ్బడిగా చార్జీలను పెంచడంతో నగరంలో సిటీ బస్సులో ప్రయాణీంచే సామాన్య ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చిల్లర సమస్యను పరి ష్కరించేందుకు రౌండ్‌ ఫిగర్‌ పేరుతో అన్ని సర్వీస్‌లకు వర్తించేలా మార్చిలో రూ.5 పెంచిన సంస్థ, వారం రోజులు తిరగముందే బస్‌ పాస్‌ ధరలను భారీగా పెంచింది. జనరల్‌ ఆర్టినరీ బస్‌ పాస్‌ ధరను రూ.970 నుంచి రూ.1150లకు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ధరను రూ.1070 నుంచి 1300కు పెంచారు. అలాగే మెట్రో డీలక్స్‌ బస్‌ పాస్‌ ధరను రూ.1185 నుంచి రూ.1450లకు, ఏసీ బస్‌ పాస్‌ ధరను రూ.2500 నుంచి 3 వేలకు పెంచారు. హైదరాబాద్‌ మెట్రో పరిధిలో నడిచే అన్ని సిటీ బస్‌ సర్వీసుల్లో కనీస ధరను రూ.10గా నిర్ణయించారు. డిజిల్‌ ధరల కారణంగా వస్తున్న నష్టాలు వస్తున్నాయని డిజిల్‌ సెస్‌ పేరుతో రూఆర్డిన రికి రూ.2, మెట్రో ఎక్స్‌ ప్రెస్‌, మెట్రో డీలక్స్‌, ఏసీ డీలక్స్‌ కోచ్‌లకు రూ.5 చొప్పున వడ్డించింది.

పెరుగుతున్న ఇంధన ధరల వల్ల వస్తున్న నష్టాలను అధిగమించేందుకు పెంపు తప్పదని ఆర్టీసీ చెబుతున్నప్పటికి పెరుగుతన్న చార్జీలు నగరంలో కూలీ, నాలీ చేసకునే సామాన్య ప్రజలకు భారంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి టీఎస్‌ఆర్టీసీకి ప్రత్యేక రాయితీలు ఇచ్చి పెంచిన సిటీ బస్సు చార్జీలను తగ్గించాలని నగర ప్రజలు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement