Sunday, May 5, 2024

10th క్లాస్ విద్యార్థులకు గుడ్ న్యూస్ !!

కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణలో పాఠశాలలు తాత్కాలికంగా మూసేసిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షలు మాత్రం యధావిధిగా జరుగుతాయని బోర్డ్ ప్రకటించింది. అయితే పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు స్టడీ మెటీరియల్ అందుబాటులోకి వచ్చింది.

డిజిటల్ తరగతుల ద్వారా పొందిన అవగాహనను మరింత అర్థం చేసుకునేలా, సులభంగా అర్థమయ్యేలా ఆంగ్లం, తెలుగు, ఉర్దూ మీడియాల్లో మెటీరియల్ తెచ్చామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కార్పొరేట్ సంస్థల నోట్స్ కంటే ఈ మెటీరియల్ అద్భుతంగా ఉంటుందన్నారు.ఆ మెటీరియల్ scert.telangana.gov.inలో అందుబాటులో ఉంటుందని ఆమె అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement