Thursday, May 2, 2024

వ్యాక్సిన్ తీసుకున్నా… కరోనా వస్తుంది !!

వ్యాక్సిన్ తీసుకున్న సరే. కరోనా రావొచ్చని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. పండగల దృష్ట్యా బయటకు వచ్చినా తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు. మార్కులు ధరించడం, భౌతిక దూరం చాలా ముఖ్యమన్నారు. కరోనా సెకండ్ వేవ్ కు భయపడవలసిన అవసరం లేదని తెలిపారు. ఈ వైరస్ సోకిన వారిని త్వరగా గుర్తిస్తే వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని…కరోనా బాధితులు ద్వారా కరోనా వైరస్ ఐదు నుంచి ఆరు మంది వరకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని అన్నారు.

ఇక తెలంగాణలో గడచిన 24 గంటల్లో495 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,804కి చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement