Friday, April 26, 2024

వృద్ధ కళాకారులకు ఫించన్ పెంపు.. జూన్ 2 నుంచి అమలు

తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధ కళాకారులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.1500లను రూ.3016కు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఏర్పాట్లు కీలకంగా వ్యవహరించిన వృద్ధ కళాకారుల గౌరవార్థం వారి పెన్షన్‎ను పెంచగా.. పెరిగిన పెన్షన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నుండి అమలులోకి రానుంది.

పెన్షన్ విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాల కన్నా ఎంతో మేలైన మొత్తాన్ని అందిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన మొదటి దఫాలో రూ.200 ఉన్న పింఛన్ రూ.1000కి(దివ్యాంగులకు రూ.1500), రెండో దఫాలో రూ.2016 (దివ్యాంగులకు రూ.3016) చేసింది. ఇదే తరహాలో వృద్ధ కళాకారులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.1500 మొత్తాన్ని రూ.3016కి పెంచగా.. దీనిపై సాంస్కృతిక, పర్యాటకశాఖల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సీఎం కేసీఆర్‎కు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ నిర్ణయంతో తెలంగాణలోని 2661 మంది కళాకారులకు ప్రయోజనం చేకూరనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement