Thursday, May 2, 2024

తెలుగు యాంకర్‌పై సోనూసూద్ ప్రశంసలు

దేశంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ సూపర్ హీరో కన్నా ఎక్కువగా సాయం చేస్తున్న సోనూ సూద్ తాజాగా ఓ తెలుగు యాంకర్ మీద ప్రశంసల జల్లు కురిపించాడు. మీరు నిజమైన రాక్ స్టార్ అంటూ యాంకర్‎ను తెగ పొగుడుతూ ఏకంగా వీడియోను పెట్టాడు. ఇంతకీ ఆ యాంకర్ ఎవరంటే.. వింధ్యా విశాఖ. తెలుగు టీవీ షోలతో పాటు స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్‎లో వచ్చే ఐపీఎల్. ప్రొకబడ్డీ లీగ్‎లకు వింద్యా విశాఖ ప్రజెంటర్‎గా వ్యవహరిస్తోంది. అయితే దేశంలో ఏ అవసరం వచ్చినా ఆదుకుంటున్న సోనూ సూద్.. తన పేరుతో ఓ ఫౌండేషన్‎ను ప్రారంభించి, విరాళాలు సేకరిస్తున్నారు. ఇలా సోనూ సూద్ ఫౌండేషన్‎కు తెలుగు యాంకర్ వింద్యా విశాఖ తనవంతు సాయంగా విరాళం అందించింది. తన కాస్ట్యూమ్స్‎ను వేలం వేసి, వచ్చిన నగదును సోనూ సూద్ ఫౌండేషన్‎కు ఇచ్చేసింది. దీంతో ఖుషీ అయిపోయిన సోనూ ఆమెను పొగడ్తల వర్షంలో ముంచెత్తాడు.

ఇంతకీ సోనూ సూద్ ఏమన్నాడంటే..?

“హాయ్‌ వింధ్యా విశాఖ.. మీరు చేసిన సాయానికి చిన్న ‘థాంక్స్‌’ అనే పదం సరిపోదు. సోనూసూద్‌ ఫౌండేషన్‌పై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు. మీరు నిజమైన రాక్‌స్టార్‌. మీరు చేసిన సహాయం పేదల ముఖాలపై నవ్వులు వెలిగిస్తుంది.. మీకు మంచి భవిష్యత్‌ ఉండాలని కోరుకుంటున్నా. జాగ్రత్తగా ఉండండి” అంటూ సోనూసూద్ పేర్కొన్నాడు. కాగా సోనూసూద్‌ స్వయంగా స్పందించి తనకు బదులివ్వడంపై వింధ్యా విశాఖ సంతోషం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తూ వీడియోను కూడా అభిమానులతో పంచుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement