Wednesday, May 8, 2024

అంత‌ర్జాతీయ జిమ్నాస్టిక్స్ లో తెలుగమ్మాయి సత్తా.. రెండు స్వర్ణాలు కైవసం..

అంతర్జాతీయ జిమ్మాస్టిక్స్‌ వేదికపై తెలంగాణ అమ్మాయి సత్తా చాటింది. ఈజిప్ట్‌లోని కైరోలో ఫారోస్‌కప్‌ 2021లో హైదరాబాదీ జిమ్మాస్ట్‌ అరుణారెడ్డి అద్భుత ప్రదర్శనతో పసిడి పతకాలను సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ టోర్నీలో అరుణారెడ్డి రెండు స్వర్ణాలు గెలుచుకుంది.

టేబుల్‌వాల్ట్‌, ఫ్లోర్‌ఈవెంట్‌ విభాగాల్లో బంగారు పతకాలు సాధించింది. కాగా 2018లో జరిగిన ప్రపంచ జిమ్నాస్టిక్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ అరుణారెడ్డి కాంస్యం సాధించింది. తెలుగు జిమ్నాస్ట్‌ అరుణారెడ్డి అంతర్జాతీయస్థాయిలో రాణించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement