Monday, April 29, 2024

పార్లమెంట్‌ను తాకిన తెలంగాణ వరదలు.. లోక్‌సభలో ఎంపీ రేవంత్‌రెడ్డి వాయిదా తీర్మానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ వరద విపత్తు పార్లమెంట్‌ను చేరింది. గత పది రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వరద పరిస్థితులపై మల్కాజ్‌గిరి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్రం వరదల నష్టాన్ని అంచనా వేయాలని, ప్రత్యేక బృందాలను పంపాలని, తక్షణమే వరద సహాయాన్ని అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ వరదలు సంభవించాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై పార్లమెంట్‌లో వెంటనే చర్చ జరపాలని రేవంత్ రెడ్డి సోమవారం ఇచ్చిన వాయిదా తీర్మానంలో కోరారు. అనేక మంది నిరాశ్రయులయ్యారని, 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని వణికిస్తున్న వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఇప్పటికే రేవంత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement