Saturday, May 4, 2024

నీటి వివాదంపై.. ప్రధాని మోదీని కలవనున్న సీఎం కేసీఆర్

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నీటి వినియోగంపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంపై ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాయగా.. ఈ అంశంపై పరిష్కారం చూపాలని ప్రధాని మోదీని కలవాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఆయన ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం అనుమతి లేకుండానే విద్యుత్ ఉత్పత్తి కోసం కృష్ణా జలాలను ఉపయోగిస్తోందని… దాన్ని నిలిపివేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని శుక్రవారం రాసిన ఓ లేఖ ద్వారా ప్రధానిని జగన్ కోరారు. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదంలో కలగజేసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: తండ్రిని మించిన దుర్మార్గుడు జగన్

Advertisement

తాజా వార్తలు

Advertisement