Sunday, April 28, 2024

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు…పై చేయి ఎవరిది ?

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. గవర్నర్ తమిళిసై మొదట ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సమావేశాల ఎజెండా బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను నిర్ణయిస్తారు. ఇక ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 16వ తేదీన రెండు సభల్లోనూ సంతాప తీర్మానాలు చేయనున్నారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. అలాగే 18న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత 20వ తేదీ నుంచి దీనిపై చర్చ కొనసాగనుంది.

మొత్తం ఈ సమావేశాలు రెండు వారాలపాటు జరపనున్నారు. ఇక టిఆర్ఎస్ ను ప్రశ్నించేందుకు కాంగ్రెస్ బిజెపిలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈసారి టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం తప్పులను ఎత్తి చూపే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.కాజీపేట రైల్వే కోచ్, పెట్రోల్ గ్యాస్ ధరలు, బయ్యారం ఉక్కు పై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు నిరుద్యోగ భృతి పి.ఆర్.సి ఎల్.ఆర్.ఎస్ సమస్యలు పై కాంగ్రెస్ బిజెపి లు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement