Sunday, April 28, 2024

తెలంగాణ కొత్తగా 1088 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు మరిన్ని తగ్గాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,088 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా కారణంగా మరో 9 మంది మృతి చెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో 1511 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,17,776కు చేరింది. అలాగే డిశ్చార్జ్ అయిన వారి కేసుల సంఖ్య 5,98,139కి చేరింది.

ఇక కరోనా కారణంగా మొత్తం 3,607 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,030 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1,19,466 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement