Friday, May 3, 2024

ఆది సాయికుమార్ తీస్ మార్ ఖాన్ టీజ‌ర్ – హాట్ గా పాయ‌ల్ రాజ్ పుత్

ప్రేమ‌కావాలి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది అన‌తికాలంలోనే మంచి న‌టుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు సాయికుమార్ వార‌సుడు ఆది సాయికుమార్. ఆరు సినిమాల‌ను లైన్ లో పెట్టారు హీరో ఆది సాయికుమార్. అందులో ‘తీస్ మార్ ఖాన్’ ఒక‌టి. క‌ళ్యాణ్ జీ గోగ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌లే మేక‌ర్స్ జూలై 27న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఆఫీస్‌కు వెళ్ళే మా అన్న తిరిగి రాలేడు’ అంటూ టీజ‌ర్ మొద‌లైంది. ‘మ‌నం ఆప‌ల‌నుకున్నంత ప‌వ‌ర్ మ‌న ద‌గ్గ‌రున్న.. మ‌నం ఆప‌లేనంత ప‌వ‌ర్ వాడి ద‌గ్గ‌రుంది’ సార్ అంటూ వ‌చ్చే డైలాగ్ విల‌న్ బ‌లాన్ని తెలియజేస్తుంది. టీజ‌ర్ మొత్తం ఆది ప‌వ‌ర్ ప్యాక్‌డ్ షోతో నిండి ఉంది. చాలా కాలం త‌ర్వాత ఆది ఈ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నట్లు టీజ‌ర్‌ను చూస్తే తెలుస్తుంది. హీరోయిన్ గా పాయ‌ల్ రాజ్ పుత్ న‌టించింది. ఈ చిత్రాన్ని విజ‌య్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తిరెడ్డి నిర్మించారు. సునీల్‌, పూర్ణ‌, క‌బీర్ దుహ‌న్ సింగ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రంలో ఆది మూడు విభిన్న పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. ఒక‌టి స్టూడెంట్ పాత్ర కాగా మ‌రోక‌టి రౌడి పాత్ర‌.. ఇంకోటీ పోలీస్ పాత్ర‌. మ‌రి ఈ మూడు పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌న ఏ మేర‌కు అల‌రించ‌నున్నాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement