Friday, May 3, 2024

హన్మకొండ చౌరస్తా లో కేటీఆర్ ను ఉరితీయాలి…మల్లన్న

సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్ మార్ మల్లన్న. కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయన్నారు మల్లన్న. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ కి చెందిన ఓ నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆ నిరుద్యోగిని మల్లన్న పరామర్శించారు.

అనంతరం మాట్లాడుతూ… హనుమకొండ చౌరస్తా లో మంత్రి కేటీఆర్ ను ఉరి తీసినా తప్పు లేదని నోటిఫికేషన్లు వేయకుండా ఉద్యోగులకు ఆశ చూపిస్తున్నాడని మండిపడ్డారు . అలాగే మహబూబాబాద్ జిల్లా క్గూడూరు మండలం కు చెందిన సునీల్ ఆత్మహత్య యత్నం చేశాడు. నిరుద్యోగ సమస్యలు ప్రభుత్వానికి తెలియాలని ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీశాడు. విద్యార్థులారా… ఉద్యోగం మన హక్కు వడలకండి కేసీఆర్ ను అసలు వడలకండి అంటూ పిలుపునిచ్చారు మల్లన్న.

Advertisement

తాజా వార్తలు

Advertisement