Thursday, May 16, 2024

IndvsAfg 3rd T20 | టీమిండియా త‌డ‌బాటు.. ఆదిలోనే 4 వికెట్లు అవుట్‌

ఆఫ్గాన్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో టీమిండియా త‌డ‌బాటుకు గుర‌వుతోంది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఐదు ఓవర్లలోనే కీల‌క‌మైన నాలుగు వికెట్లు వికెట్లు కోల్పోయింది. ఇవ్వాల (బుధవారం) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదిలోనే టాప్ ఆర్డ‌ర్ కుప్ప‌కూలింది.

మూడో ఓవర్లో ఫరీద్ అహ్మద్ మాలిక్ బౌలింగ్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ (4), విరాట్ కోహ్లీ (0) వరుసగా ఔట్ అయ్యారు. ఆ త‌ర్వాత నాలుగో ఓవర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో శివమ్ దూబే (1) పరుగుతో పెవిలియన్ చేరాడు. త‌ర్వాత వచ్చిన సంజు శాంసన్ ఐదో ఓవర్లో మాలిక్ బౌలింగ్ ఔట్ అయ్యి గోల్డెన్ డక్‌తో పెవిలియన్ చేరాడు. ఇక ప్రస్తుతం రోహిత్ 25, రింకూ సింగ్ 9 క్రీజ్‌లో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement