Monday, April 29, 2024

బెస్ట్ వర్క్‌ప్లేస్‌గా టీసీఎస్‌.. తరువాతి స్థానాల్లో అమెజాన్‌ మోర్గాన్‌ స్టాన్లీ

దేశంలో పని చేసేందుకు బెస్ట్‌ వర్క్‌ప్లేస్‌గా టాటా కన్సల్టెంటెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) అగ్రస్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో అమెజాన్‌, మోర్గాన్‌ స్టాన్లీ ఉన్నాయని లింక్డ్‌ఇన్‌ వెలువరించిన నివేదిక తెలిపింది. మెరుగైన పని వాతావరణం ఉన్న 25 కంపెనీల జాబితాను లింక్డ్‌ ఇన్‌ ప్రకటించింది. పని చేసేందుకు అనువైన నగరాల్లో ముంబై, హైదరాబాద్‌, ఢిల్లి, పూణే మొదటి స్థానాల్లో ఉన్నాయి. 8 అంశాల ఆధారంగా వీటిని ఎంపిక చేసినట్లు లింక్డ్‌ ఇన్‌ తెలిపింది. సంస్థ ప్రమాణాలు, నైపుణ్యాల పెరుగుదల, కంపెనీ స్థిరత్వం, బయటి అవకాశాలు, ఉద్యోగుల కంపెనీతో అనుబంధం, లింగ వైవిధ్యం వంటి అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. 25 బెస్ట్‌ వర్క్‌ ప్లేస్‌ల్లో 17 కొత్తవి ఉన్నాయి. డ్రీమ్‌ 11, గేమ్స్‌ 24 ఇంట్‌ 7 కూడా ఈ జాబితాలో మొదటిసారి చోటు దక్కించుకున్నాయి. జిఎ్టో కూడా టాప్‌ లిస్ట్‌లో ఉంది.

- Advertisement -

సాఫ్ట్‌వేర్‌ రంగంలో కంపెనీలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌,సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌, కంప్యూటర్‌ సెక్యూరిటీ వంటి నైపుణ్యాలు ఉన్న అభ్యర్ధుల కోసం వెతుకుతున్నాయి. ఫైనాన్షియల్‌ రంగంలోకి కంపెనీలు కమర్షియల్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌, గ్రోత్‌ స్టాటజీలలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం వెతుకున్నాయని నివేదిక వెల్లడించింది. గేమింగ్‌, ఎడ్‌టెక్‌ కంపెనీలు ప్రధానంగా పార్టనర్‌ డెవలప్‌మెంట్‌, ఇన్‌సైడ్‌ సేల్స్‌ వంటి నైపుణ్యాలు న్న వారి కోసం చూస్తున్నాయని లింక్డ్‌ ఇన్‌ తెలిపింది. వీటితో పాటు ఇండస్ట్రీయల్‌ డిజైన్‌, గేమ్‌ డెవలప్‌మెంట్‌ స్కిల్స్‌కు కూడా డిమాండ్‌ పెరుగుతున్నదని తెలిపింది. టాప్‌ 25 కంపెనీల్లో ఎక్కువ కంపెనీలు ప్రధానంగా ఇంజినీరింగ్‌, కన్సల్టెంగ్‌, సేల్స్‌, కస్టమర్‌ సక్సెస్‌, డిజైన్‌, ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌ వంటి జాబ్స్‌పై ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపింది.

నైపుణ్యం ఉన్న వారికి ఉద్యోగాలు కల్పించడంలో అధిక కంపెనీలు ఉన్న బెంగళూర్‌ మొదటి స్థానంలో ఉంది. దీని తరువాత ముంబై, హైదరాబాద్‌, ఢిల్లి, పూణే నిలిచాయి. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు ప్రధానంగా కంపెనీ గురించి వివరాలు తెలుసుకోవడం, సమగ్రతను చూపించడం, ప్రామాణికంగా ఉండటం, ఉద్దేశాన్ని ప్రదర్శించడం, ఆసక్తిగా ఉండటం వంటి అంశాలను చూడాలని లింక్డ్‌ ఇన్‌ కెరీర్‌ ఎక్స్‌పీర్‌, ఇండియా మేనేజింగ్‌ ఎడిటర్‌ నిరజితా బెనర్జీ చెప్పారు. అభ్యర్ధులు డిమాండ్‌లో ఉన్న నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. ప్రస్తుతం అనిశ్చిత వాతావరణ ఉందని, వృత్తిపరమైన వృద్ధిని అందించే కంపెనీల కోసం నిపుణులు సరైన గైడెన్స్‌ కోసం చూస్తున్నారని తెలిపారు. లింక్డ్‌ ఇన్‌ ప్రకటించిన టాప్‌ 25 కంపెనీలు అన్ని స్థాయిల్లో నిపుణులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో సహాయపడుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement