Wednesday, May 1, 2024

Keedaa Cola | రేపు వ‌రంగ‌ల్ లో త‌రుణ్ టీం.. సినీ ప్రేక్ష‌కుల‌తో మాటామంతి

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమాల‌తో సూప‌ర్ హిట్లు అందుకున్న తరుణ్ భాస్క‌ర్.. ప్ర‌స్తుతం ‘కీడా కోలా’ సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాల త‌రువాత త‌రుణ్ భాస్క‌ర్ డైరెక్ష‌న్ లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో ఈ సినిమాపై ఫ్యాన్స్, మూవీ ల‌వ‌ర్స్ లో మంచి అంచ‌ణాలే ఉన్నాయి. కాగా, సరికొత్త క్రైమ్‌ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ ద‌గ్గుబాటి రానా సమర్పణలో న‌వంబ‌ర్ 03న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమాలో తరుణ్‌ భాస్కర్, బ్రహ్మనందం, చైత‌న్య రావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి టీజ‌ర్ విడుద‌ల కాగా ప్రేక్ష‌కుల నుంచి విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుద‌ల ద‌గ్గ‌రప‌డుతుండటంతో ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టారు మేక‌ర్స్. ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ‘కీడా కోలా’ టీమ్ యూనిట్ వ‌రంగ‌ల్ వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆడిటోరియంలో రేపు (ఆదివారం) సాయంత్రం 6:30 గంటలకు కీడా కోలా టీం ఈవెంట్ ఉందని.. వరంగల్ వచ్చేయండి అంటూ ట్విట్టర్ లో రాసుకోచ్చారు మేకర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement