Friday, March 31, 2023

మాకు సమయం లేదు..

సినీ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్న అస్కార్‌కు సమయం దగ్గర పడింది. మన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నామినేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. నాటు నాటు పాటకు ఆస్కార్‌ వస్తుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆర్‌ ఆర్‌ఆర్‌ టీమ్‌ అమెరికా చేరుకుంది. అక్కడ వివిధ మీడియా సంస్థలకు ఇంటర్యూలు ఇస్తున్నారు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, రాజమౌళి, కీరవాణి, రాహులు సిప్లిగంజ్‌ తదితరు లు అక్కడి మీడియాతో ముచ్చటిస్తున్నారు.
రామ్‌చరణ్‌ బృందం ఇప్పటికే లాస్‌ ఏంజిల్స్‌లో ఉంది. కొద్ది రోజులు తర్వాత ఎన్టీఆర్‌ సైతం అక్కడికి చేరుకున్నారు.

- Advertisement -
   

అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఎన్టీఆర్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ రెడ్‌ కార్పెట్‌ మీద నడవటం గురించి చెప్పుకొచ్చారు.
” రెడ్‌ కార్పేట్‌ మీద నడిచేది నేను, రామ్‌చరణ్‌, రాజమౌళి అని అనుకోవడం లేదు. మేము మొత్తం భారతదేశాన్ని మా హృదయాల్లో మోయబోతున్నాం. ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ నాటు నాటు పాటకి డాన్స్‌ చేస్తామనే విషయాన్ని చెప్పలేదు. ఎందుకంటే నాకు, రామ్‌ చరణ్‌కు రిహార్సల్స్‌ చేసే సమయం కనిపించడం లేదు. అందుకే ఆస్కార్‌ వేదికపై మేము డాన్స్‌ చేయలేకపోతున్నాం అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement