Thursday, March 30, 2023

AP: మార్గదర్శిపై సీఐడీ దాడులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాల్లో సీఐడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇండ్లలో సోదాలు చేస్తున్నారు. విజయవాడలో సంస్థ మేనేజర్ శ్రీనివాస్‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని ఆయన కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. నెల రోజుల క్రితం హైదరాబాద్‌లోని మార్గదర్శి కార్యాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement