Monday, April 29, 2024

FIFA World Cup | ఆస్ట్రేలియాపై విజ‌యం.. స్వీడన్ ఖాతాలో మరో కాంస్యం

బ్రిస్బేన్‌లోని లాంగ్ పార్క్‌లో జ‌రిగిన‌ మహిళల ఫుట్ బాల్ ప్రపంచ కప్‌లో స్వీడన్ మరో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మూడో ప్లేస్ ప్లేఆఫ్‌లో భాగంగా ఇవ్వాల (శ‌నివారం) జ‌రిగిన మ్యాచ్ లో హోస్టింగ్ టీమ్ ఆస్ట్రేలియాపై 2-0 తేడాతో విజయం సాధించింది స్వీడన్. దీంతో త‌మ‌ను థ‌ర్డ్ ప్లేస్ గేమ్ లో ఓడించడం కష్టమని మరోసారి నిరూపించుకున్నారు స్వీడిష్ మహిళలలు. ఈ విన్ తో స్వీడన్ తమ నాల్గవ మహిళల ప్రపంచ కప్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

సెమీ-ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను 3-1తో ఇంగ్లండ్‌ ఓడించగా, స్వీడన్‌ను 2-1తో స్పెయిన్‌ ఓడించింది. కాగా, రేపు (ఆదివారం) సిడ్నీలో జరిగే ఫైనల్‌లో యూరోపియన్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌, స్పెయిన్ తలపడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement