Sunday, November 10, 2024

జులై 31 లోగా ఇంటర్​ ఫలితాలు వెల్లడించాలి: సుప్రీం కోర్టు ఆదేశం

ఇంటర్మీడియట్ ఫలితాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జులై 31 లోగా ఇంటర్మీడియట్ ఫలితాలను వెల్లడించాల్సిందిగా అన్ని రాష్ట్రాల ఇంటర్ బోర్డులను సుప్రీం కోర్టు ఆదేశించింది. అందుకు పది రోజుల్లోగా ఇంటర్నల్ అసెస్ మెంట్ పూర్తి చేయాలని సూచించింది. సీబీఎస్ఈ, సీఐఎస్ సీఈలు దాఖలు చేసిన అఫిడవిట్లపై సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. అన్ని రాష్ట్రాల బోర్డుల మాదిరే సీబీఎస్ఈ, సీఐఎస్ సీఈ కూడా జులై 31లోగా ఫలితాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. కాగా, ఇప్పటిదాకా 21 రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలను రద్దు చేయగా.. ఆరు రాష్ట్రాల్లో నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement