Tuesday, October 8, 2024

టాలెంట్ ను గుర్తించిన కేటీఆర్….అవకాశం ఇస్తానన్న దేవి శ్రీ

దేవి శ్రీ ప్రసాద్ ఇండస్ట్రీ లో ఎన్నో సూపర్ డూపర్ సాంగ్స్ కి మ్యూజిక్ అందించారు. అలాగే తెలుగు ఇండస్ట్రీ కి దేవిశ్రీప్రసాద్ ఎంతోమంది టాలెంట్ ఉన్న వారిని కూడా పరిచయం చేశారు. కాగా తాజాగా తెలంగాణకి చెందిన ఓ మట్టిలోమాణిక్యం ని పరిచయం చేస్తూ దేవిశ్రీప్రసాద్ అలాగే థమన్ ను ట్యాగ్ చేస్తూ… తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

అయితే దీనిపై దేవిశ్రీప్రసాద్ స్పందిస్తూ… ఆ చిన్నారి గాయని ప్రతిభని ప్రశంసిస్తూ… ఇలాంటి టాలెంట్ ను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు చెప్పాడు. ఇలాంటి టాలెంట్ ఉన్నవారి కోసం వెతుకుతున్నానని ఆమె వివరాలు కనుక్కుంటాను అని దేవిశ్రీప్రసాద్ హామీ ఇచ్చాడు. అలాగే తన కొత్త షో ద్వారా ఆమెకు అవకాశం కూడా కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఇక సినిమాల విషయానికొస్తే దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం పుష్ప సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. వీటితో పాటు పవన్ హరీష్ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు. అలాగే మరికొన్ని సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement