Tuesday, April 30, 2024

హైకోర్టుకు సుప్రీం అక్షింతలు.. అండర్‌ ట్రయల్స్‌ ఖైదీలను విడుదల చేయలేద‌ని యూపీపై సీరియస్‌

అండర్‌ ట్రయల్స్‌ను సకాలంలో విడుదల చేయని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వంపై, అలహాబాద్‌ హైకోర్టుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడింది సుప్రీంకోర్టు. దాదాపు 853 కేసులు పరిశీలించలేదని, వాటిపై నిర్ణయం తీసుకోవడానికి సమయం కావాలని యుపి ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పదేళ్లకుపైగా జైల్లో మగ్గుతున్న మొత్తం 853 మంది ఖైదీల వివరాలను అందజేయాలని రాష్ట్రాన్ని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. అంతే కాదు సమాధానం ఇవ్వాల్సిందేనని చెప్పింది. సులెమాన్‌ వర్సెస్‌ ది స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర ప్రదేశ్‌ అనే కేసును విచారిస్తున్న సందర్బంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు ఆగస్టు 17న మరోసారి విచారణకు వచ్చే అవకాశముంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement