Thursday, May 2, 2024

సూప‌ర్ స్టార్ కృష్ణ మృతి చలన చిత్ర రంగానికి తీరని లోటు : మంత్రి హ‌రీష్ రావు

సూపర్ స్టార్ కృష్ణ మృతి చ‌ల‌న చిత్ర రంగానికి తీర‌ని లోట‌ని మంత్రి హరీశ్ రావు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 350కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రియుల హృదయాల్లో సూపర్ స్టార్‌గా నిలిచారన్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ అధితనేతగా ఆయన చలన చిత్ర రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పౌరాణిక, కుటుంబ, సాంఘీక చిత్రాల్లోను, అల్లూరి సీతారామరాజు వంటి చారిత్రాత్మక పాత్రలు, కౌబాయ్, జెమ్స్ బాండ్ తరహా విభిన్న పాత్రలు పోషించి సినీ ప్రియులను రంజింపజేశారన్నారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు మంత్రి హరీశ్‌రావు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement