Sunday, April 28, 2024

కోహ్లీ వెంటనే సచిన్ సలహా తీసుకో: గవాస్కర్

రన్ మిషన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యంపై మాజీ ఆటగాడు దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. కోహ్లీ ఈ కిష్టపరిస్థితలను అదిగమించాలంటే సచిన్ టెండుల్కర్ కి ఫోన్ చేసి సలహా తీసుకోవాలని సూచించాడు. కోహ్లీ సచిన్ నుంచి స్ఫూర్తి పొందాల్సింది ఎంతైనా ఉందని పేర్కొన్నాడు. 2004 సిడ్నీ టెస్టులో సచిన్ తన సత్తా చాటి తిరిగి ఫామ్ లోకి వచ్చినట్టే కోహ్లీ కూడా ఫామ్ ను తిరిగి సంపాదించుకోవాలన్నారు. ‘‘కోహ్లీ వెంటనే సచిన్ టెండూల్కర్ కు ఫోన్ చేయాలి. ఏం చేయాలో అడగాలి. అతడి సలహాలు తీసుకోవాలి’’ అని సూచించారు. కవర్ డ్రైవ్ ఆడనని తనకు తాను చెప్పుకోవాలన్నారు. 2004 సిడ్నీ టెస్టులో సచిన్ టెండూల్కర్ 241 పరుగులతో అజేయంగా నిలిచాడు. 613 నిమిషాల పాటు క్రీజులో నిలిచిన లిటిల్ మాస్టర్.. ఒక్కసారి కూడా కవర్ డ్రైవ్ ఆడలేదు. సచిన్ ఇన్నింగ్స్ తో భారత్ 705/7 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. సొంతగడ్డపై ఆడుతున్న ఆస్ట్రేలియా మ్యాచ్ ను డ్రా చేసుకుంది.

సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లీ స్ఫూర్తి పొందాలని టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించారు. లీడ్స్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఆండర్సన్ బౌలింగ్ లో కోహ్లీ కేవలం 7 పరుగులకే అవుటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సన్నీ ఈ కామెంట్లు చేశారు. ఆఫ్ స్టంప్ కు ఆవల పడిన బంతులను కోహ్లీ వేటాడడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఐదు, ఆరు, ఏడో స్టంప్ ల దగ్గర పడిన బంతులకు కోహ్లీ ఔట్ కావడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమన్నారు. 2014లో అతడు అలాగే ఆఫ్ సైడ్ స్టంప్ ల మీద పడిన బంతులకే ఎక్కువ సార్లు అవుటైన విషయాన్ని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: Virat kohli: సెంచరీ లేని అర్థసెంచరీ

Advertisement

తాజా వార్తలు

Advertisement