Saturday, May 4, 2024

వేసవి సెలవులు పొడగింపు లేదు.. రేపటి నుంచే స్కూళ్లు ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, ఎండల తీవ్రత కారణంగా స్కూళ్లకు వేసవి సెలవులు పొడగిస్తారనే ప్రచారం జరగడంతో విద్యాశాఖ అధికారులు ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. వేసవి సెలవులను పొడగించే ఆలోచన లేదన్నారు. యథావిధిగా బడులు సోమవారం నుంచే ప్రారంభం అవుతాయని ఉన్నతాధికారులు తెలిపారు. వేసవి సెలవులను కొన్ని రోజుల వరకు పొడిగిస్తున్నారనే ప్రచారం జరగడంతో తల్లిదండ్రుల్లో గందరగోళం ఏర్పడింది. దాంతో ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే జూన్‌ 13 నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement