Thursday, May 2, 2024

బిబా ఫ్యాషన్‌ ఐపీఓ, సెబీకి పత్రాల సమర్పణ.. 90కోట్ల నిధుల సమీకరణ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఐపీఓల సందడి ప్రారంభమైంది. మహిళల సంప్రదాయ వస్త్రాల విక్రయ సంస్థ బిబా ఫ్యాషన్‌ ఐపీఓగా వచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఐపీఓకు సంబంధించిన కీలక పత్రాలన్నీ సెబీకి సమర్పించింది. 1986లో ఈ కంపెనీ స్థాపించబడింది. అప్పటి నుంచి మహిళల సంప్రదాయ వస్త్ర రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాధించుకుంది. వివిధ బ్రాండ్లకు సంబంధించిన వస్త్రాలు విక్రయించడంతో పాటు మార్కెటింగ్‌, డిజైనింగ్‌, డెవలపింగ్‌ వంటి కార్యకలాపాలను కూడా చేపడుతున్నది. ఈ ఐపీఓ ద్వారా రూ.90కోట్లు విలువ చేసే తాజా ఈక్విటీ షేర్లను విక్రయించేందుకు బిబా ఫ్యాషన్‌ నిర్ణయించింది. మరో 2.77 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉంచేందుకు తెలిపింది. మీనా బింద్రా ఈ కంపెనీకి ప్రమోటర్‌గా ఉన్నారు. 37.52 లక్షల షేర్లను విక్రయించేందుకు సిద్ధం అయ్యారు.

వార్‌బగ్‌ పింకస్‌ నేతృతంలోని హైడెల్‌ ఇనెస్ట్‌మెంట్‌ 1.84 కోట్ల షేర్లు, ఫేరింగ్‌ క్యాపిటల్‌ 55.86 లక్షల షేర్లు ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా విక్రయించనున్నారు. ఐపీఓలో సమీకరించిన నిధులతో.. రుణ చెల్లింపులతో పాటు జనరల్‌ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్టు సెబీకి సమర్పించిన పత్రాల్లో కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ.. దుస్తులతో పాటు ఆభరణాలు, పాదరక్షలు, వ్యాలెట్లు కూడా విక్రయిస్తుంటుంది. జేఎం ఫైనాన్షియల్‌, యాంబిట్‌, ఈక్విరస్‌ క్యాపిటల్‌, డీఏఎం క్యాపిటల్‌ అడ్వైజర్స్‌, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్‌ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement