Thursday, May 2, 2024

కోట్ల రూపాయలన్న మాటకే పడిపోయారా ? అలా ఎలా రెడ్డి గారు !!

300 కోట్ల రూపాయలతో ఆసుపత్రి ఉచితంగా కట్టిస్తామని ఓ వ్యక్తి చెప్పగానే అతనెవరో, అతని పరిస్థితి ఏంటో ఆలోచించకుండా ప్రకటనలు చేసి ఆర్భాటాలకు పోయారు టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డిలు. అయితే అసలు విషయం తెలిసిన కొందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇందులో ఆశ్చర్యానికి గురవటానికి ఏం ఉంది అనుకుంటున్నారా?? ముంబై కి చెందిన ఉద్వేగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ కంపెనీ తిరుపతిలో 300 కోట్ల రూపాయలతో చిన్న పిల్లలకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించేందుకు ముందుకు వచ్చింది.వెంటనే చైర్మన్ సుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డిలు ప్రకటనలు విడుదల చేశారు.

అయితే ఆ కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం…!! ఆ కంపెనీకి ఉన్న మొత్తం ఆస్తులన్నీ కలిపినా 300 కోట్ల రూపాయలలో ఒకటవ వంతు కూడా లేవు. కానీ ఆ కంపెనీ డైరెక్టర్ సంజయ్ కేసింగ్ వై వి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి లతో భేటీ కావడం విరాళాన్ని ప్రకటించటం అన్నీ జరిగిపోయాయి. ఇక ఆ కంపెనీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కి ఇచ్చిన లెక్కల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థకు వచ్చిన ఆదాయం కేవలం 49,900 మాత్రమేనట. ఖర్చు అయ్యింది లక్షా 25 వేల రూపాయలట. అంటే 75 వేల రూపాయల నష్టం అన్నమాట.

అయితే ఈ కంపెనీ 2017లో ఇన్ కార్పొరేట్ కాగా సంజయ్, వర్దన్ ఇద్దరు డైరక్టర్లు ఉన్నారు. సంజయ్ కేథర్ నాథ్ సింగ్ మూడు మొత్తం కంపెనీల్లో డైరక్టరుగా ఉన్నారు. దేవాంతి టూరిజం అండ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, మహాదత్ ప్రీసియస్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు డైరక్టర్‌గా ఉన్నారు. ఈ రెండు కంపెనీలు ఆరునెలల క్రితం ఏర్పాటయ్యాయి. మరి ఇలాంటి కంపెనీ డైరక్టర్ రూ300కోట్ల విరాళం ప్రకటిస్తే ఏమీ చెక్ చేయకుండా ఆయన మాటను నమ్మి ప్రకటనలు చెయ్యటం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు ఆసుపత్రి నిర్మాణం కోసం పది ఎకరాల భూమిని కూడా ఇచ్చేందుకు సిద్ధపడింది. ఇది తెలిసిన కొందరు విశ్లేషకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement