Friday, May 3, 2024

రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసులు

దేశంలో కొత్త క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. వరుసగా మూడో రోజు కొత్త కేసుల సంఖ్య మ‌ళ్లీ 25 వేలు దాటింది. గత 24 గంటల్లో 26,291 మందికి కరోనా నిర్ధారణ అయింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన వాటి ప్రకారం… 17,455 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,85,339కు చేరింది. ఇక గడచిన 24 గంట‌ల సమయంలో 118 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,725 కు పెరిగింది. 2,19,262 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

తెలంగాణలోను కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్త‌గా 157 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 166 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,318కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,681 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,654గా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 1,983 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 718 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 35 మందికి క‌రోనా సోకింది.

ఏపీలో కరోనా మళ్లీ స్పీడ్ పెంచుతోంది. ఏపీ ప్రభుత్వం నిన్న సాయంత్రం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 298 మందికి సోకింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 90 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 48 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాలో 32, కృష్ణా జిల్లాలో 32, విశాఖ జిల్లాలో 32 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక 164 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,91,861 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,83,277 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 1000కి పైనే నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్య 7,184కి పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement