Saturday, May 18, 2024

న‌గ‌రంలోఈదురుగాలుల‌తో వర్ష బీభ‌త్సం… పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం దంచి కొడుతోంది. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, కూకట్ పల్లి, సనత్ నగర్, ఖైరతాబాద్, గచ్చిబౌలీ, కొండాపూర్, హైటెక్ సిటీ, పటాన్ చెరు, ఈసీఐఎల్, ఎల్బీనగర్, చర్లపల్లి ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల 40 కి.మీ వేగంంతో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తోన్నాయి.

అలాగే, చాలా చోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో మరో రెండు గంటల పాటు భారీ వర్షాలు ఉన్నందున జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ ప్రకటించారు. బయటకు రావొద్దంటూ నగరవాసులకు హెచ్చరిక జారీ చేశారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే..

Advertisement

తాజా వార్తలు

Advertisement