Friday, May 3, 2024

సెన్సార్ వర్క్ పూర్తి చేసుకున్న అఖిల్ “ఏంజెంట్”.. రన్ టైమ్ ఇదే

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్. ఈ చిత్రం లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా, స్టార్ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటున్నాయి.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుండి యూ/ఏ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం రన్ టైమ్ 156 నిమిషాల నిడివి కలిగి ఉంది. హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement