Thursday, May 9, 2024

Follow up : లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు వరసగా 6వ రోజూ లాభాల్లో ముగిశాయి. మంగళవారం నాడు ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు ఇంట్రాడేలో జీవనకాల గరిష్టాన్ని తాకాయి. చమురు ధరలు తగ్గడం, రూపాయి విలువ స్థిరంగా ఉండటంతో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేశీయ సూచీలు మాత్రం వరసగా లాభాల్లోనే ముగుస్తున్నాయి. సెన్సెక్స్‌ 177.04 పాయింట్లు లాభంతో 62681.84 వద్ద ముగిసింది. నిఫ్టీ 55.30 పాయింట్ల లాభంతో 18618.05 వద్ద ముగిసింది బంగారం 10 గ్రాముల ధర 351 రూపాయలు పెరిగి 52524 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 339 రూపాయలు పెరిగి 61230 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.59 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు

హిందూస్థాన్‌ యూనిలీవర్‌, నెస్లే ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఐటీసీ, ఎంఅండ్‌ ఎం, ఇన్పోసిస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యూక్సిస్‌ బ్యాంక్‌, ఆల్ట్రాటెక్‌ సింమెట్స్‌, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి.

- Advertisement -

నష్టపోయిన షేర్లు

ఇండస్‌ ఇండ్‌ బ్యాంంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మారుతి సుజుకీ, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా, కొటక్‌ మహీంద్రా బ్యాంంక్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, విప్రో, ఎస్‌బీఐ, ఎన్టీపీసీ, టీసీఎస్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement