Friday, May 17, 2024

సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న – మంత్రి ఉషశ్రీ చరణ్

శ్రీకాకుళం – కలియుగ ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అయినటువంటి అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ దర్శించుకున్నారు. ఆలయ సందర్శనకు విచ్చేసిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను మంత్రికి అందజేసారు. ఈ సందర్భంగా అనివెట్టి మండపంలో ఆలయ అర్చకులు వేద మంత్రాలతో మంత్రిని ఆశీర్వదించగా, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు చిన్మయీ దేవి, డివిజనల్ రెవెన్యూ అధికారి బొడేపల్లి శాంతి, ఆలయ ప్రధాన అర్చకులు స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను మంత్రికి అందజేసారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయ విశిష్టతను మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా సహాయ కమీషనర్ శిరీష,ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement