Sunday, April 28, 2024

రేపు శాకుంత‌లం.. చిత్రంపై అప్ డేట్

స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ని పోషిస్తున్న చిత్రం శాకుంత‌లంద‌.ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనన్య నాగళ్ల, అదితీ మోహన్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో గుణ టీమ్‌ వర్క్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.శాకుంతలం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. కాగా శాకుంతలం సినిమా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ కొత్త సంవత్సరాన్ని ఓ కొత్త ఎక్జయిటింగ్‌ అనౌన్స్ మెంట్‌తో మొదలుపెట్టబోతున్నాం. రేపు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రకటన ఉండబోతుందని దర్శకుడు గుణశేఖర్ టీమ్ వర్క్స్ ట్వీట్ చేసింది. దీంతో రిలీజ్‌ డేట్‌ పై రేపు క్లారిటీ రాబోతుందంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు సినీ జనాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement