Tuesday, April 30, 2024

న‌ష్టాల‌తో ప్రారంభం..న‌ష్టాల‌తో ముగింపు.. స్టాక్ మార్కెట్..

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడో రోజు కూడా స్టాక్‌ మార్కెట్ ఉదయం నష్టాలతోనే ప్రారంభ‌మ‌యింది. మూడో త్రైమాసికం ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు మధ్యాహ్నం తర్వాత క్రమంగా నష్టపోయాయి. అన్నింటికీ మించి ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించేందుకు పోటీ పడుతుండటంతో అమ్మకాలు జోరుమీదున్నాయి. ఫలితంగా దేశీ సూచీలు భారీగా నష్టపోయాయి.నిన్న బేర్ కొట్టిన దెబ్బకు మదుపరుల రూ.4.82 లక్షల కోట్ల సంపద ఆవిరి అయ్యింది. చివరకు, సెన్సెక్స్ 677.77 పాయింట్లు (1.13%) క్షీణించి 59,306.93 వద్ద నిలిస్తే, నిఫ్టీ 185.60 పాయింట్లు (1.04%) నష్టపోయి 17,671.70 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.90 వద్ద ఉంది. టెక్ మహీంద్రా, ఎన్​టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఐండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ షేర్లు నేడు భారీగా నష్టపోతే.. అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, శ్రీ సిమెంట్స్ షేర్లు లాభాలు గడించాయి. బ్యాంకు, ఐటీ, విద్యుత్, చమురు .. గ్యాస్ సూచీలు నేడు ఎక్కువగా నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement