Sunday, May 12, 2024

పుట్టిన ఏడాదికే .. సినీ అరంగ్రేటం..పునీత్ రాజ్ కుమార్ సినీ ప్ర‌స్థానం..

సినీ రంగంలో ఎంతో మంది సినీ వార‌సులు వ‌స్తుంటారు..అయితే వారంద‌రూ స‌క్సెస్ అవుతార‌ని చెప్ప‌లేం. కొంత‌మంది అయితే మెగా..ప‌వ‌ర్..స్టైలిష్‌..ఇలా ప‌లు బిరుదుల‌ను సార్థ‌కం చేస్తుంటారు. అలా సినీ వార‌సుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టారు పునీత్ రాజ్ కుమార్. ఎంత సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా..టాలెంట్ లేక‌పోతే రాణించ‌డం క‌ష్ట‌మే..అంతేకాదు ప్ర‌జ‌ల అభిమానాన్ని సంపాదించ‌డం అంత సులువేం కాదు. వీట‌న్నింటిని అధిగ‌మించి సినీ వార‌సుడ‌నే ముద్ర‌ని చెరిపివేసి..త‌న‌కంటూ ఓ పేరుని..క్రేజ్ ని సంపాదించుకున్నాడు పునీత్. ఏకంగా క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ గా పేరుని సంపాదించుకుని ప్రేక్ష‌కుల‌కి చేరువ‌య్యాడు. అంత‌టి మ‌హాన‌టుడు హ‌ఠాత్త్ మ‌ర‌ణం క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌నే కాదు యావ‌త్ సినీ ప్ర‌పంచాన్నే శోక‌సముద్రంలోకి నెట్టివేసింది. గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణించ‌డంతో క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ మూగ‌బోయింది.

పునీత్ అసలు పేరు లోహిత్. పునీత్ కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా చేసారు. పునీత్ బాల్యమంతా మైసూరులోనే గడిచింది. పునీత్ 17 మార్చి 1975 లో రాజ్ కుమార్ , పార్వతమ్మ దంపతులకి జన్మించారు .. చిన్నతనంలో పునీత్ ను, పూర్ణిమను రాజ్ కుమార్ సినిమా సెట్స్ కు తీసుకు వెళ్లేవారు . అలా చిన్న వయసు నుంచే పునీత్‌ రాజ్‌ కుమార్‌ సినిమా ప్రపంచంలో పెరిగాడు . పుట్టిన ఏడాదిలోనే పునీత్ సినిమాలో నటించడం విశేషం .. దర్శకుడు సోమశేఖర్ పునీత్ ఆరు నెలల వయస్సులో అతని థ్రిల్లర్ చిత్రం ప్రేమద కనికే లో పునీత్ ని నటింప చేశాడు.. అలా పుట్టిన ఏడాది లోపే నటనలో అడుగుపెట్టాడు .. ఆ తర్వాత ఆరతిలో తెరపైకి తెచ్చారు.. దీని తర్వాత సనాది అప్పన్న వంటి పలు చిత్రాల్లో బాలనటుడిగా నటించి మెప్పించాడు .. పునీత్ ఉత్తమ బాల నటుడిగా కూడా అవార్డును అందుకున్నాడు. తన యుక్తవయస్సు ప్రారంభంలో శివ మెచ్చిద కన్నప్ప లో తన అన్నయ్య శివతో కలిసి యువ కన్నప్పగా కనిపించాడు.

కాగా పునీత్ తన తండ్రితో కలిసి పరశురామ్ చిత్రంలో చివరిసారి బాల నటుడుగా నటించాడు . ఆ త‌ర్వాత 2002లోపునీత్ హీరోగా సినీ రంగ ప్రవేశం చేశాడు.. తెలుగు చిత్రం ఇడియట్ రీమేక్ గా తెరకెక్కిన అప్పుతో తొలి చిత్రంతోనే ఘ‌న విజయాన్ని అందుకున్నాడు .. తెలుగు దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం . ఆ తర్వాత పునీత్ అభిలో నటించి మెప్పించాడు .అలాగే అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయికి రీమేక్ లోను నటించి విజయాన్ని అందుకున్నాడు .. తెలుగు ఒక్కడుకి రీమేక్ లోను నటించి ..మరోసారి విజయాన్ని అందుకున్నాడు .. అరసు చిత్రంలో ప్రేమించిన స్త్రీ కోసం తన సంపదను వదులుకునే ప్రవాస వ్యాపారవేత్తగా నటించి తన మొదటి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నాడు.. అలాగే మిలానాతో మొదటిసారి కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నాడు.
ఆ తర్వాత కొంత హవా తగ్గినా ..2010లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో తిరిగి వెలుగులోకి వచ్చాడు. 2012లో పార్వతమ్మ రాజ్‌కుమార్ నిర్మించిన యాక్షన్ చిత్రం అన్నా బాండ్‌ లో నటనకు ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నాడు . పునీత్ తమిళ రీమేక్ పోరాలిలో నటించి మెప్పించాడు . తెలుగు చిత్రం దూకుడుకి రీమేక్ లోను నటించి అలరించాడు ఈ చిత్రం ఆరు రోజుల్లో రికార్డు స్థాయిలో ₹22 కోట్లు వసూలు చేసింది. 2017లో పునీత్ నటించిన రాజకుమార కన్నడ బాక్సాఫీస్‌ రికార్డ్‌లను బద్దలు కొట్టింది .. ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ భాషా చిత్రంగా నిలిచింది. 2019లో ఆయన నటించిన నటసార్వభౌమ చిత్రం విడుదలై కమర్షియల్‌గా విజయం సాధించింది .. తెలుగు చిత్రాల రీమేక్ ల ద్వారా భారీ విజయాలను అందుకోవడమే కాక ..మంచి పాపులారిటీ దక్కించుకొని పవర్ స్టార్ గా అభిమానుల నీరాజనాలు అందుకున్నాడు .

పునీత్ నటుడే కాదు సింగ‌ర్ కూడా.. జోతే జోతెయాలిలో పాడిన పాట ఆడియెన్స్ ని అలరించింది … అలాగే పలు చిత్రాల్లో పాటలు పాడారు .. తన హోమ్-ప్రొడక్షన్స్ కాకుండా ఇతర చిత్రాల కోసం పాడినందుకు వచ్చిన పారితోషకాన్ని స్వచ్ఛంద సంస్థకు అందజేసేవాడు.. పునీత్ బుల్లితెరపై కూడా మెరిశాడు .. 2012లో పునీత్ .. కౌన్ బనేగా కరోడ్‌పతి కన్నడ ప్రోగ్రాం కి హోస్ట్ గా అల‌రించాడు.. కలర్స్ కన్నడ రియాలిటీ షో, అలాగే ఫ్యామిలీ పవర్‌కి హోస్ట్‌గా వ్యవహరించి బుల్లితెరపై కూడా ఆకట్టుకున్నాడు ..ఉదయ టివిలో నేత్రవతి అనే సీరియల్‌ని నిర్మిచాడు .. పునీత్ చిక్కమగళూరుకు చెందిన అశ్విని రేవంత్‌ని వివాహం చేసుకున్నారు. పునీత్ తన సినీ జీవితంలో దాదాపు 30కి పైగా కన్నడ చిత్రాల్లో నటించి అభిమానులను అలరించారు.

అభి, వీర కన్నడిగ, అజయ్, అరసు, రామ్, హుడుగారు, అంజనీ పుత్ర వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించారు పునీత్. అతను చివరిసారిగా యువరత్నలో కనిపించాడు. కన్నడ ఇండస్ట్రీలోనే పవర్ స్టార్ గా క్రేజ్ ను సంపాదించుకుని రాజ్ కుమార్ కి తగ్గ తనయుడ‌ని అనిపించుకున్నారు. గాయకుడిగా పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పునీత్​ నటిస్తున్న రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. సినిమాలే కాదు.. సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు.. తన తల్లి పార్వతమ్మతో కలిసి ప‌లు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేవాడు. మైసూరులో ఉన్న శక్తి ధర్మ ఆశ్రమం మంచి చెడ్డలు ఆయనే చూసుకునేవారు. కన్నడలో టాప్ హీరో అవడంతో ప్రచారకర్తగా కూడా పునీత్ కు చాలా డిమాండ్ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు టీమ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.

- Advertisement -

ఈ రోజు గుండెపోటుతో రావ‌డంతో ఆయ‌న్ని విక్రమ్ ఆసుపత్రికి త‌ర‌లించారు. చికిత్స తీసుకుంటూ ఆయ‌న మ‌ర‌ణించిన విష‌యాన్ని డాక్టర్స్ అధికారికంగా ప్రకటించారు.. ఈరోజు ఉదయం జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించిగా.. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.. ఆస్పత్రి నుంచి డేడ్‌బాడీని బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి తరలించారు. పునీత్‌ మృతిపై కన్నడ సీని ప్రముఖులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతిపై పలువురు సినీ పెద్దలు, ప్రముఖులు ట్వీట్‌లు చేశారు. ట్విట్టర్‌ ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement