Thursday, May 2, 2024

శ్రీదేవి,శోభ‌న్ బాబు ప్రేమ క‌థ‌..

సంతోష్‌ శోభన్‌, గౌరి జి.కిషన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వంలో సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 18న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో…
నిర్మాత సుస్మిత కొణిదెల మాట్లాడుతూ ”శ్రీదేవి శోభన్‌బాబు నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా. చిన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ సినిమా కోసం అందరం మనసు పెట్టి పని చేశాం. సంతోష్‌ ఇలాంటి విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ పాత్రను అద్భుతంగా చేశాడు. బాషా, మొయి న్‌ వంటి యంగ్‌ టాలెంట్‌తో నే కాదు.. నాగబాబుగారు, రోహిణిగా రి వంటి సీనియర్స్‌ కూడా సినిమా లో నటించారు. నా వెనుక మా వారు విష్ణు, మా కో ప్రొడ్యూసర్‌ శరణ్య సపోర్ట్‌గా నిలిచారు.” అన్నారు.


నిర్మాత విష్ణు ప్రసాద్‌ మాట్లాడుతూ ”ఫిబ్రవరి 18న శ్రీదేవి శోభన్‌బాబు మూవీ రిలీజ్‌ అవుతుంది. టీమ్‌ సభ్యులకు అభినందనలు.” అన్నారు.
సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ ”అవకాశం ఎప్పుడూ గొప్పదే. నన్ను, ప్రశాంత్‌ను నమ్మి అవకాశం ఇచ్చిన సుస్మిత అక్క, విష్ణుగారికి థాంక్స్‌. 1970 నేపథ్యంలో విలేజ్‌ బ్యా క్‌డ్రాప్‌లో సాగే ప్రపంచానికి ఓ ట్రిబ్యూట్‌లాంటి సినిమాగా శ్రీదేవి శోభన్‌బాబు ఉంటు-ంది.” అన్నారు.
దర్శకుడు ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల మాట్లాడుతూ ”శ్రీదేవి శోభన్‌బాబుసినిమాను సరదాగా అందరూ ఎంజాయ్‌ చేస్తారు. ఈ సినిమా చూసిన తర్వాత మన కుటు-ంబ సభ్యులందరూ కలుసుకుంటే బావుంటు-ందనే ఆలోచన అందరిలోనూ వ స్తుంది. సరదాగా ఎం జాయ్‌ చేసే సరదా సిని మా ‘శ్రీదేవి శోభన్‌బా బు” అన్నారు.
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శరణ్య పొట్ల, గౌరి జి.కిషన్‌ మాట్లా డా రు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌ బాషా, మొయి న్‌, డాలీ, సిద్ధార్థ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement