Thursday, May 2, 2024

Breaking : ఆస్ట్రేలియాలో శ్రీలంక క్రికెటర్​ అరెస్టు.. మహిళపై లైంగిక వేధింపులే కారణం

శ్రీలంక క్రికెటర్​ దనుష్క గుణతిలక ఆస్ట్రేలియాలో అరెస్ట్​ అయ్యాడు. అక్కడి మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సిడ్నీ పోలీసులు ఇవ్వాల (ఆదివారం) దనుష్కను అదుపులోకి తీసుకున్నారు. లెఫ్ట్ హాడ్ బ్యాటర్​గా దనుష్క గుణతిలకకు మంచి పేరుంది. ICC T20 వరల్డ్​ కప్ ఆడేందుకు గుణతిలక ఆస్ట్రేలియా వెళ్లాడు. సిడ్నీ తూర్పు శివారు ప్రాంతంలో ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ మీడియా కథనం ప్రకారం.. ఈ వారం ప్రారంభంలో రోజ్ బేలో గుణతిలక ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. 29 ఏళ్ల మహిళను లైంగికంగా వేధించడంతో ఆదివారం ఉదయం గుణతిలకను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దనుష్క గుణతిలకకు బెయిల్ నిరాకరించగా.. కాసేపట్లో పర్రమట్టలోని కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే.. గుణతిలక ఆ మహిళతో లైంగికంగా కలిసే ముందు.. కొన్ని రోజులు ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా కమ్యూనికేట్ చేసినట్లు మరో గాసిప్​ వెలుగులోకి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement