Saturday, May 18, 2024

నువ్వే కావాలి అమ్మ‌….

మౌనీస్‌ కుమార్‌ కల్ల సంగీత సారథ్యంలో సందీప్‌ సన్ను దర్శకత్వంలో సీనియర్‌ నటి ఆమని, మానస్‌ తల్లి, కొడుకులుగా. నటించిన పాట ‘నువ్వే కావాలి అమ్మ’. ఈ పాటను జ్యోతి కున్నూరు నిర్మించారు. తల్లి, కొడుకులపై చిత్రీకరించిన ఈ పాటను మా ఈసీ సభ్యురాలు శైలజ, సీనియర్‌ నటి ఆమని, పద్మిని నాగులపల్లి, నిర్మాత జ్యోతి కున్నూరు కలసి ”నువ్వే కావాలి అమ్మ” పాటను నివ్రితి వైబ్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా విడుదల చేశారు. వీరితో పాటు- ఇంకా ఈ కార్యక్రమానికి మాదాల రవి, ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ బసిరెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్‌, సంగీత దర్శకులు రఘు కుంచె,మదీన్‌,కాశర్ల శ్యామ్‌, హీరో సుధాకర్‌, ఈ సి మెంబెర్‌ శ్రీనివాస్‌, కాసర్ల శ్యామ్‌, శ్రీని ఇన్ఫా శ్రీను, బిగ్‌ బాస్‌ ఫెమ్‌ హారిక, సింగర్‌ మధు ప్రియ, హాక్సా ఖాన్‌, తదితరులతో పాటు- పాట యూనిట్‌ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement