Monday, April 29, 2024

డ‌ప్పు కొట్టి చెప్పుకోనా…

శివ కందుకూరి ఓ ఆసక్తికరమైన సిని మాతో అలరించేందుకు సిద్దమవుతున్నాడు. రాశి సింగ్‌ హీరోయిన్‌ గా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు ‘భూతద్ధం భాస్కర్‌ నారా యణ’. స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో శివ కందుకూరి డి-టె-క్టీవ్‌ గా కనిపించనున్నాడు. తాజాగా ఈ చిత్రం నుండి ”డప్పుకొట్టి చెప్పుకొనా… ” అనే పాటను విడుదల చేశారు. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. అందరికి అర్ధ మయ్యే పదాలతో భాస్కర్‌ భట్ల ఈ పాటను రచించారు. ఈ సినిమా మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ కందుకూరి, రాశి సింగ్‌, అరుణ్‌, దేవీప్రసా ద్‌, వర్షిణి, షఫీ, కల్పలత, ప్రణవి, దివిజ, ప్రభాకర్‌, కమల్‌, గురురాజ్‌ తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement