Monday, December 2, 2024

సింగ‌రేణి సిగ‌లో సోలార్ ప‌వ‌ర్..

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తున్న సింగరేణి.. ఇప్పు డు సొంతంగా సోలార్‌ పవర్‌ ఉత్పత్తి చేస్తోంది. పర్యావరణ రహిత చర్యల్లో భాగంగా వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టిన సింగరేణి సంస్థ సోలార్‌ ప్లాంట్లు నెలకొల్పుతున్నది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఎనిమిది ఏరియాల్లో 13 ప్లాంట్లను నెలకొల్పుతున్నది. దేశంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఏ ప్రభుత్వ రంగసంస్థ కూడా ఇప్పటి వరకు సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి రంగంలోకి దిగలేదు. థర్మల్‌ విద్యుత్‌తో పాటు సోలార్‌ విద్యుత్‌ రంగంలోకి అడుగు పెట్టిన ఘనత దేశంలో సింగరేణి కాలరీస్‌కే దక్కుతుంది.

సింగరేణి వ్యాప్తంగా ఏర్పాటు చేసే ఈ సోలార్‌ ప్లాంట్లను మూడు దశల్లో పూర్తి చేయాలని, నిర్మాణ సంస్థలకు ఇప్పటికే కాంట్రాక్టు పనులను అప్పగించింది. ఈ నిర్మాణాలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకోగా.. పనులు కూడా పూర్తికావచ్చాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement