Saturday, May 4, 2024

TS | సంక్రాంతికి స్వగ్రామాలకు సాఫ్ట్‌వేర్లు.. హైదరాబాద్‌ రోడ్లు ఖాళీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగకు జనం సొంతూళ్లకు వెళ్లిపోవడంతో దాదాపు సగం హైదరాబాద్‌ నగరం ఖాళీగా కనిపిస్తోంది. ఎప్పుడూ బారీ ఎత్తున ట్రాఫిక్‌ జాంతో పద్మవ్యూహాన్నితలపించే పలు జంక్షన్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. సాధారణంగా బతుకమ్మ, దసరా పండక్కి తెలంగాణ జిల్లాలకు సంబంధించిన వారు ఎక్కువగా వెళ్తుంటారు. కానీ సంక్రాంతికి తెలంగాణ జిల్లాలకు చెందినవారితో పాటు- ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా సొంతూళ్లకు వెళ్తారు. దీంతో హైదరాబాద్‌ నగరం సగం ఖాళీగా కనిపిస్తోంది.

ఎప్పుడు బిజీ బిజీగా ఉండే హైదరాబాద్‌ రోడ్లన్ని ప్రస్తుతం ఖాళీగా దర్శనిస్తున్నాయి. అసలు ట్రాఫిక్‌ అనే మాటే వినిపించడం లేదు. సెటిలర్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో రోడ్లన్ని నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి సెలవుల కారణంగా విద్యార్థులకు సెలవులు ఇవ్వడంతో స్కూల్‌ జోన్లు కూడా బోసిపోయాయి. సంక్రాంతి పండుగ ముగిసేంత వరకు మూడు రోజులపాటు హైదరాబాద్‌లో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది.

సంక్రాంతి సెలవులకు సాప్ట్‌nవేర్లంతా ఊరి బాట పట్టడంతో ఐటీ- క్యారిడార్లు బోసిపోయాయి. వందలాది ఫుడ్‌ కోర్టులు కూడా షట్‌ డౌన్‌ అయ్యాయి. హైదరాబాద్‌ వాసులంతా గ్రామాలకు తరలివెళ్లడంతో.. సిటీ-లోని పలు ప్రాంతాల్లో నిఘా పెంచినట్లు- పోలీస్‌ అధికారులు తెలిపారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌ గా దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉండటంతో పెట్రోలింగ్‌ చేస్తున్నారు. మళ్లిd మంగళవారం నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ పెరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement