Monday, April 29, 2024

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో చేపట్టే పాదయాత్ర షెడ్యూల్ లో స్వల్ప మార్పులు జ‌రిగాయి. రేవంత్ రెడ్డి ఈ నెల 15 నుండి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఈ నెల 14న రేవంత్ రెడ్డి భద్రాచలంలో పాదయాత్ర ఉన్నందున వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో 15వ తేదీ నుండి ప్రారంభమవుతుంది.
నియోజకవర్గ వారిగా పాదయాత్ర షెడ్యుల్ …
ఫిబ్రవరి 15వ తేదిన పాలకుర్తి నియోజకవర్గం.
ఫిబ్రవరి 16వ తేదిన వర్ధన్నపేట నియోజకవర్గం.
ఫిబ్రవరి 17వ తేదిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం.
ఫిబ్రవరి 18 & 19వ తేదిన మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా విరామం.
ఫిబ్రవరి 20వ తేదిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం & వరంగల్ తూర్పు నియోజకవర్గం.
ఫిబ్రవరి 21 & 22 వ తేదిన భూపాలపల్లి నియోజకవర్గం.
ఫిబ్రవరి 23, 24, 25 & 26వ తేదిన రాయ్ పూర్ ఛత్తీస్ గడ్ లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొంటారు.
ఫిబ్రవరి 27 వ తేదీన పరకాల నియోజకవర్గం.

Advertisement

తాజా వార్తలు

Advertisement