Monday, April 29, 2024

మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో LDS సంస్థ ప్రతినిధి బృందం భేటీ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల విదేశీ ప్రతినిధి బృందం సభ్యులు ప్రశంశించారు. ల్యాటర్ డిసెన్స్ సంస్థ (LDS) కోరం ఆఫ్ ది 12 ప్రెసిడెంట్ డిటర్ ఎఫ్ ఉక్ డార్క్స్, ఆసియా ఏరియా ప్రెసిడెంట్ జాన్సన్, ఆసియా ఏరియా మేనేజర్ జాన్ గుట్టి, LDS సభ్యులు జితేందర్, శంకర్ లూక్ సోమవారం హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర ఎస్సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ తో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాలకు సంబంధించి పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రలు, మైనార్టీల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు, వారికి అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రతినిధులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ వివరించారు. ఇప్పటికే ధర్మపురి నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ పాఠశాలలల స్థితిగతులు, అంగన్ వాడీ కేంద్రాలను పరిశీలించామని సభ్యులు చెప్పారు. తెలంగాణలో విద్య వైద్య సేవలతో పాటు వ్యవసాయం, సాగు నీటి రంగాల ప్రగతితో పాటు, మైనార్టీల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను LDS సభ్యులు ప్రసంశించారు. తమ వంతు ఆయా రంగాలకు మానవతా సహాయం అంద చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ఈ నెల 18 నుంచి మార్చి 3వ తేదీ వరకు అమెరిక లో నిర్వహించనున్న రూట్స్ టెక్ ఎక్స్ పో – 2023లో తెలంగాణ ప్రభుత్వం తరపున పాల్గొనాల్సిందిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆహ్వానించారు. ఈ సందర్బంగా LDS సభ్యులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ మెమెంటో అందచేసి శాలువాతో సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement