Friday, April 19, 2024

Breaking: న్యూజిలాండ్ లో భారీ భూకంపం.. తీవ్రత 6.1గా నమోదు

న్యూజిలాండ్ లో భారీ భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. భూకంపం రావడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతంలోని ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపంకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవలే తుర్కియా, సిరియాలో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అక్కడి భూకంపం కారణంగా చనిపోయిన వారి సంఖ్య 34వేలు దాటిన సంగతి విదితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement