Saturday, April 27, 2024

చిన్న, మధ్యతరహా కంపెనీలే ఐటీ రంగానికి వెన్నుముక.. ఐటీశాఖ కార్యదర్శి జయేష్‌రంజన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: చిన్న, మధ్యతరహా కంపెనీలే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పరిశ్రమకు నిజమైన వెన్నుముక అనిరాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌ అన్నారు. సోమవారం మైగో కన్సల్టింగ్‌ సంస్థ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… రూ.30కోట్ల పెట్టుబడితో 100కి పైగా ఉద్యోగా కల్పన లక్ష్యంతో ఈ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటైందన్నారు. 2025 నాటికి దేశ వ్యాప్తంగా విస్తరించి 800 నుంచి 1000 మందికి ఉపాధి కల్పించనుందని చెప్పారు. గూగుల్‌, అమెజాన్‌, మైక్రో సాఫ్ట్‌, ఇతర అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు అభివృద్ధి చెందేందుకే ఈ పరిశ్రమలే కారణమన్నారు.

మైగో కంపెనీ ఒక ప్రత్యేకత గల సంస్థ అని చెప్పారు. విభిన్నరంగాల్లో విభిన్న దేశాల్లో ఖాతాదారులను కలిగి ఉందన్నారు. గడిచిన పదేళ్లలో వేగంగా అభివృద్ధి చెందిన సంస్థగా పేర్కొన్నారు. అనంతరం ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్‌ నగరం ఐటీ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉందన్నారు. బెంగళూరు తర్వాత అత్యధిక ఐటీ ఎగుమతులు హైదరాబాద్‌ నుంచే జరుగుతున్నాయని చెప్పారు. మాదాపూర్‌లో మైగో కార్యాలయాన్ని ప్రారంభించ డం మైగో సీఈవో శేషు మారం రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో భారత క్రికెటర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌, భారత సంతతికి చెంది జమైకన్‌ పారిశ్రామికవేత్త శేకర్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement