Thursday, April 25, 2024

ఆక‌ట్టుకుంటోన్న సీతారామం చిత్రం ట్రైల‌ర్

అద్భుత‌మైన పెర్ఫార్మ‌న్స్..అంద‌మైన విజువ‌ల్స్ .. వినసొంపైన మ్యూజిక్ తో కూడిన ట్రైలర్ సీతారామం చిత్రం నుంచి ప్రేక్ష‌కుమ‌ల ముందుకు వ‌చ్చంది..ట్రైల‌ర్ తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. ఒక గొప్ప ప్రేమ కథను ఆవిష్కరించబోతున్న ‘సీతారామం’ సినిమా . హీరో దుల్కర్ సల్మాన్ ..మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఇది. యుద్ధంతో రాసిన ప్రేమకథ అనేది దీనికి ఉపశీర్షిక. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.తెలుగు ..తమిళం.. మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన ‘సీతారామం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలోకి రానుంది.

సోమవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఎమోషనల్ గా సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.సుమంత్ – గౌతమ్ మీనన్ – ప్రకాష్ రాజ్ – భూమికా చావ్లా – శత్రు – సచిన్ ఖేడేకర్ – మురళీ శర్మ – వెన్నెల కిషోర్ – జిషు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. ‘నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే.. కాశ్మీర్ ను మంచుకొదిలేసి వచ్చేస్తారా?’ వంటి పలు సంభాషణలు బాగున్నాయి.సీతా రామం’ అనేది యుద్ధ నేపథ్యంలో సెట్ చేయబడిన బ్యూటిఫుల్ మ్యాజికల్ లవ్ స్టోరీ అని అర్థం అవుతోంది. ఈ ట్రైలర్ రామ్ .. సీతల మధ్య ప్రేమకథను అవిష్కరిస్తోంది. ఒక ఉత్తరాన్ని సీతా మహాలక్ష్మి కి అందజేయడానికి రష్మిక మందన్నా ఇండియాకి బయలుదేరడంతో ఇది ప్రారంభమైంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement