Monday, April 29, 2024

Australian Open : తొలి రౌండ్‌లో సింధు హవా..! రెండో రౌండ్‌కు శ్రీకాంత్, ప్రణయ్

ఆస్ట్రేలియాలోని సిడ్నీ లో ఇవ్వాల (బుద‌వారం) జ‌రిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023లో భార‌త బ్యాడ్మింటన్ ప్లేయ‌ర్స్ హెచ్‌ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్, పివి సింధు రెండో రౌండ్‌కు చేరుకున్నారు. పివి సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు వరుస గేమ్‌లలో విజయం సాధించి రెండో రౌండ్ కి చేరుకోగా.. పురుషుల సింగిల్స్ ప్రారంభ రౌండ్‌లో ప్రణయ్ ట‌ఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సివ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ 21-18, 16-21, 21-15తో హాంకాంగ్‌కు చెందిన లీ చెయుక్ యియుపై విజ‌యం సాదించాడు. రైజింగ్ షట్లర్ ప్రియాంషు రజావత్ కూడా ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ టాంగ్‌పై 21-12 21-16 తేడాతో విజయం సాధించాడు.

ఇక, పురుషుల సింగిల్స్ ప్రారంభ రౌండ్ మ్యాచ్‌లలో కిదాంబి శ్రీకాంత్ జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటో 21-18, 21-7 పాయింట్ల తేడాతో వ‌రుస గేమ్ ల‌లో గెలిచి రౌండ్ 2లోకి ప్రవేశించాడు.

అలాగే మహిళల సింగిల్స్ లో… పివి సింధు కూడా తన మొదటి రౌండ్ మ్యాచ్‌లో 21-18, 21-13 తేడాతో స్వదేశానికి చెందిన అష్మితా చలిహాపై విజయం సాధించింది. అదేవిధంగా, ఆకర్షి కశ్యప్ 21-15 21-17 తేడాతో మలేషియాకు చెందిన జిన్ వీ గోహ్‌ను ఓడించింది. దీంతో రేపు జ‌ర‌గ‌నున్న మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్ లో సింధు, కశ్యప్‌లు ఒకరితో ఒకరు తలపడనున్నారు..

సింగపూర్‌కు చెందిన కీన్ యూ లోహ్‌ను తొలిరౌండ్‌లో భారత ఆటగాడు మిథున్ మంజునాథ్ ఓడించాడు. మిథున్ మంజునాథ్ 21-19, 21-19తో సంచలన విజయంతో లోహ్ కీన్ యూను మట్టికరిపించాడు. అయితే పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో లక్ష్య సేన్ కిరణ్ జార్జ్‌తో జరిగిన మొదటి రౌండ్ పోటీ ప‌డ‌గా.. గాయం కారణంగా ఆట‌ నుండి రిటైర్ అయ్యాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రణయ్ చైనీస్ తైపీకి చెందిన యు జెన్ చితో తలపడనున్నాడు. అలాగే.. రజావత్, శ్రీకాంత్ తైపీకి చెందిన ప్రత్యర్థులు వరుసగా ట్జు వీ వాంగ్, లి యాంగ్ సుల‌తో తలపడతారు.

- Advertisement -

ఆస్ట్రేలియన్ ఓపెన్ రౌండ్ 1 మ్యాచ్‌లు :-

పురుషుల సింగిల్స్..

ప్రియాంషు రజావత్ నాథన్ టాంగ్‌ను ఓడించాడు – 21-12, 21-16

కిదాంబి శ్రీకాంత్ కెంటా నిషిమోటోను ఓడించాడు – 21-18, 21-7

HS ప్రణయ్ లీ చెయుక్ యియును ఓడించాడు – 21-18, 16-21, 21-15

మిథున్ మంజునాథ్ లోహ్ కీన్ యూను ఓడించాడు – 21-19, 21-19

మహిళల సింగిల్స్

పివి సింధు అశ్మితా చలిహాను ఓడించింది – 21-18, 21-13

ఆకర్షి కశ్యప్ గోహ్ జిన్ వీని ఓడించాడు – 21-15, 21-17

భారత మిక్స్‌డ్ డబుల్స్ జోడీ రోహన్ కపూర్- సిక్కి రెడ్డి 14-21 18-21తో ప్రపంచ నం.5 కొరియా జోడీ సెయుంగ్ జే సియో- యు జంగ్ చే చేతిలో ఓడి మొదటి రౌండ్ నుండి నిష్క్రమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement