Monday, April 29, 2024

సిద్దిపేట జిల్లా ప్రాజెక్ట్ ల ఖిల్లా : మంత్రి హ‌రీష్ రావు

70 ఏండ్లలో సాధించని అభివృద్ధిని ఏనిమిదేండ్లలో తెలంగాణ సాధించిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వ్యవసాయం పండుగగా మారిందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రైతులకు రైతు బంధు, బీమా ఇస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో ఐదు వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేపట్టామన్నారు. నంగునూర్ మండలం రూ.300 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందని ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్రాజెక్ట్ ల ఖిల్లాగా మారిందన్నారు. కరువు నుండి కల్పతురువు జిల్లాగా మార్చుకున్నామన్నారు. కాళేశ్వరం నీళ్లు రావడంతో, రైతులకు కన్నీళ్లు పోయాయి. నాటి భగీరథుడే.. నేటి చంద్రశేఖరుడు అన్నారు. పేదలకు కార్పొరేట్ హాస్పిటల్స్‌ మాదిరిగానే, ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పల్లెలు,ప ట్టణాలుగా మారుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా దళితుల ప్రగతికి దళిత బంధు ఇస్తున్నాం. నిరుపేదలకు నిలువెత్తు నిదర్శం డబుల్ బెడ్రూం ఇండ్లు అని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ శ్వేత, ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement