Thursday, December 7, 2023

మిస్‌ యూనివర్స్‌ గా షెన్నిస్‌ పలాసియోస్‌..

2023 సంవత్సరానికి ప్రతిష్టాత్మక మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ను నికరాగ్వాకు చెందిన షెన్నిస్‌ పలాసియోస్‌ గెలుచుకున్నారు. ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి నికరాగ్వా అందాల రాశిగా ఆమె నిలిచారు. శాన్‌ సాల్వడార్‌ వేదికగా జరిగిన ఈ అందాల పోటీల్లో మొదటి రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన ఆంటోనియో పోర్సిల్డ్‌, రెండవ రన్నరప్‌గా ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్‌ నిలిచారు.

- Advertisement -
   

మాజీ మిస్‌ యూనివర్స్‌ ఆర్‌ బానీ గాబ్రియెల్‌ షెన్నిస్‌ పలాసియోస్‌కు మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని అలంకరించారు. చివరి రౌండ్‌లో జడ్జిలు అడిగిన ”ఒక సంవత్సరం పాటు వేరే మహిళగా జీవించాలనుకుంటే ఎవరిలా ఉండాలనుకుంటారు? అందుకు కారణం ఏమిటి?” అనే ప్రశ్నకు స్త్రీల హక్కుల కోసం పోరాడిన సామాజికవేత్త మేరి వాట్సన్‌ బ్రాడ్‌లా ఉండాలనుకుంటున్నానని, ఎందుకంటే ఆమె సమాజంలో అసమానతలను తొలగించి, ఎందరో మహిళలకు అవకాశాలు కల్పించారని షెన్నిస్‌ బదులిచ్చారు.

అలాగే తాము కోరుకున్న రంగంలో మహిళలు పనిచేయడానికి ఉపకరించే పరిస్థితులను తీసుకురావడానికి తాను కృషి చేయాలని అనుకుంటున్నట్టు ఆమె తెలిపారు. మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ కోసం మొత్తం 84 దేశాలకు చెందిన యువతులు పోటీ పడ్డారు. భారత్‌ తరఫున బరిలో నిలిచిన శ్వేతా శార్దా మొదటి 20 మంది సుందరీమణుల్లో ఒకరిగా నిలిచారు. పాకిస్తాన్‌ తరఫున తొలిసారిగా ఎరికా రాబిన్‌ పోటీలో పాల్గొనడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement