Friday, May 17, 2024

న్యూలుక్ లో క‌నిపించ‌నున్న ‘శ‌ర్వానంద్’ – బ‌రువు త‌గ్గేందుకు ప్ర‌య‌త్నాలు

ఈ మ‌ధ్య‌కాలంలో సిక్స్ ప్యాక్ ల‌తో అద‌ర‌గొడుతున్నారు ప‌లువురు హీరోలు. వారి బాట‌లోనే న‌డ‌వ‌నున్నాడ‌ట యంగ్ హీరో శ‌ర్వానంద్. నెక్ట్స్ న‌టించ‌బోయే సినిమాల్లో స్లిమ్‌, ఫిట్‌గా కంప్లీట్ న్యూ లుక్‌లో క‌నిపించాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట‌. మ‌రి శ‌ర్వానంద్ న్యూ లుక్‌తో అయినా మంచి స‌క్సెస్ అందుకుంటాడా.. లేదా అనేది కాలానికే వదిలెయ్యాలి. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ (People Media Factory)లో శ‌ర్వానంద్ ఇప్ప‌టికే ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఉప్పెన ఫేం కృతిశెట్టి ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్‌లో న‌టించ‌నుంది. ఈ సినిమా ఆగ‌స్టు త‌ర్వాత మొద‌లు కానుంద‌ని తెలుస్తోండ‌గా..ఈ లోపే వెయిట్ లాస్ అయి ఫిట్‌గా మారేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నాడ‌ట శ‌ర్వానంద్‌. అయితే దీనిపై శర్వానంద్ నుంచి ఏదైనా అప్ డేట్ వస్తే కానీ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement